"కోహ్లీ, బుమ్రా ఫస్ట్‌.. రోహిత్‌ సెకండ్‌ Rakings.

 P1 News

P1 News

Author 2019-10-05 02:32:26

imgThird party image reference
imgThird party image reference

"ముంబయి: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలవగా బౌలింగ్‌ విభాగంలో జస్ప్రీత్‌ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గురువారం ప్రకటించిన వన్డే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, బుమ్రా తమ స్థానాలను పదిలపర్చుకున్నారు. మరోవైపు పాకిస్థాన్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌ శ్రీలంక సిరీస్‌లో నాలుగు వికెట్లు తీయడంతో ఆరు స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. ఇటీవలే టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకున్న అతడు నిన్న వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ అత్యుత్తమ 7వ ర్యాంక్‌ సాధించాడు.

imgThird party image reference
  • "మరో పాక్‌ బౌలర్‌ ఉస్మాన్‌ షిన్వారి ఇదే సిరీస్‌లో ఆరు వికెట్లు తీసి ఏకంగా 28 స్థానాలు ఎగబాకడంతో 43వ ర్యాంక్‌ దక్కింది. పాక్‌ బ్యాట్స్‌మన్‌ ఫకార్‌ జమాన్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ప్రస్తుతం 16వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా హారిస్‌ సోహైల్‌ మూడు స్థానాలు మెరుగుపడి 32వ ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. అలాగే శ్రీలంక బ్యాట్స్‌మన్‌ దనుష్క గుణతిలక మూడో వన్డేలో శతకం సాధించడంతో కెరీర్‌ అత్యుత్తమ 70వ ర్యాంక్‌ సాధించాడు. ఈ వన్డే సిరీస్‌ పూర్తయ్యాక పాకిస్థాన్‌, శ్రీలంక జట్లు ఆరు, ఎనిమిదో స్థానాల్లో కొనసాగుతున్నాయి.


READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD