"మయాంక్‌కు ప్రేరణనిచ్చిన వినయ్ కుమార్ ,support his Ranji teamate.
"ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న మయాంక్ అగర్వాల్‌కు కర్ణాటక మాజీ సారథి వినయ్ కుమార్ ప్రేరణనిచ్చాడని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నాడు. అతడా పని చేయకుంటే ప్రస్తుతం అత్యంత నిలకడగా రాణిస్తున్న మయాంక్‌ను చూసేవాళ్లం కాదని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకం చేసిన అతడిపై రాబిన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

‘రంజీ మ్యాచ్ నుంచి తొలగించాలని మేమంతా భావిస్తున్నప్పుడు (మాజీ) సారథి వినయ్‌కుమార్ శర్మ తన మాటలతో మయాంక్ అగర్వాల్‌కు ప్రేరణనిచ్చాడు. ఆ ప్రోత్సాహంతో అతడు త్రిశతకం బాదేయడం నాకిప్పటికీ గుర్తుంది’ అని కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రచార కార్యక్రమంలో ఉతప్ప అన్నాడు. ఆ రంజీ మ్యాచ్‌లో మయాంక్ త్రిశతకం చేయడంతో మహారాష్ట్రపై కర్ణాటక ఇన్నింగ్స్ 136 పరుగుల తేడాతో విజయం సాధించింది. ‘మయాంక్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తే మరింత మెరుగవుతాడు. ఇది అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది’ అని ఉతప్ప తెలిపాడు.


"ఓపెనర్‌గా శతకం సాధించిన రోహిత్‌ను ఉతప్ప అభినందించాడు. ‘రోహిత్ భారత్, విదేశాల్లో ఎంతో రాణించాడు. తెలుపు బంతి క్రికెట్లో ఆధిపత్యం చెలాయిస్తాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో అతనొకడు. కెరీర్లో తన బ్యాటింగ్‌పై పూర్తి అవగాహన కలిగిన స్థితికి హిట్‌మ్యాన్ చేరుకున్నాడు. ఏం చేస్తే రాణిస్తాడో అతడికి తెలుసు. అవకాశాలిస్తే అతడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సరైన సమయంలో రోహిత్‌కు ఓపెనింగ్ అవకాశం లభించింది. అతడు విజయవంతం కావడంలో ఆశ్చర్యం లేదు. సెహ్వాగ్‌తో అతడికి పోలిక లేదు. వీరూ బంతిని బలంగా బాదితే రోహిత్ లాఘవంగా తరలిస్తాడు. వీరిద్దరి ఆటతీరు, దూకుడులో ఎంతో తేడా ఉంది’ అని ఉతప్ప వెల్లడించాడు.