'ఢిల్లీ వేదిక మార్చండి'

Prajasakti

Prajasakti

Author 2019-10-30 05:00:54

img

న్యూఢిల్లీ : నవంబర్‌ 3న ఢిల్లీలో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టీ20 వేదికను మార్చాలంటూ పర్యావరణవేత్తలు కోరుతున్నారు. మంగళవారం ఈమేరకు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి లేఖను కూడా రాశారు. కాలుష్యం, మంచు కారణంగా వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యతతో ఆటగాళ్లు ఇబ్బందులకు గురికావల్సి వస్తుందని, దీని కార ణంగా తొలి టీ20ను ఢిల్లీకి బయట నిర్వహిస్తే బాగుం టుందని ఆ లేఖరు వారు పేర్కొన్నారు. అంతేగాకుండా ఇటీవల ముగిసిన దీపావళికి బాణాసంచా కాల్చడం ద్వారా కూడా ఢిల్లీ కాలుష్యభరితంగా మారిందని ఈ పరిణామాల నేపథ్యంలోనే టీ20 వేదికను మార్చితే బాగుంటుందని తెలిపారు. పై కారణల కారణంగా డిసెంబర్‌ 2017లో శ్రీలంక ఆటగాళ్లు మైదానంలోనే వాంతులు చేసుకొన్న సంగతి వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN