తొలి టెస్టు మ్యాచ్‌కి భారత జట్టు

V6velugu

V6velugu

Author 2019-10-01 17:52:16

img

విశాఖపట్నం వేదికగా  రేపటి(బుధవారం) నుంచి దక్షిణాఫ్రికా, భారత్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు భారత తుది జట్టును BCCI ఇవాళ (మంగళవారం) ప్రకటించింది. వికెట్ కీపర్‌ రిషబ్ పంత్‌పై వేటు వేసిన టీమిండియా మేనేజ్‌మెంట్.. కీపర్‌గా సాహాకి అవకాశమిచ్చింది. ఓపెనర్‌‌గా రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఆడనుండగా, మిడిలార్డర్‌లో హనుమ విహారికి చోటు దక్కింది. సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకి మరో అవకాశం దక్కింది. గాయపడిన జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్‌కి తుది జట్టులో ఛాన్స్ దక్కలేదు.

వైజాగ్ టెస్టుకి భారత్ జట్టు ఇదే:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN