అంతర్రాష్ట్ర కళాశాల క్రికెట్‌ పోటీల్లో మనోజ్‌ శతకం

Prajasakti

Prajasakti

Author 2019-11-05 01:44:41

img

ఎమరాల్డ్స్‌ డిగ్రీకళాశాల ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్‌ కళశాల క్రికెట్‌ పోటీలలో క్రీడాకారులు పరుగుల వరద సృష్టిస్తు విజయకేతనం ఎగురవేస్తున్నారు. ఈ పోటీల్లో క్వార్టర్‌ పెనల్‌ దశకు చేరుకున్నట్లు ఆర్గనైజింగ్‌ కార్యదర్శి మునిరత్నం తెలిపారు. ఉదయం జరిగిన ఎమరాల్డ్‌ డిగ్రీ కళాశాల- వింక్స్‌ బిజినెస్‌ స్కూల్‌ మధ్య జరిగిన పోటీల్లో ఎమరాల్డ్‌ డిగ్రీకళాశాల విజయకేతనం ఎగరవేసింది. ముందుగా ఎమరాల్డ్డ్‌ డ్రిగీ కళాశాల టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 20 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఇందులో ఎమరాల్డ్స్‌ క్రీడాకారుడు మనోజ్‌సాయి వర్మేష్‌ 61 బంతుల్లో 13ఫోర్లు, రెండు సిక్సర్లతో 100 పరుగులు చేశారు. తరువాత బ్యాటింగ్‌ దిగిన వింగ్స్‌ బిజెనెస్‌ స్కూల్‌ పదివికెట్లు కోల్పోయిన 52 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఎమరాల్డ్స్‌ బౌలర్‌ మహమ్మద్‌ ఆలీ 4 ఓవర్లకు 19 పరుగులు ఇచ్చి 4వికెట్లు పడగొట్టాడు. తరువాత ఎస్వీ యూనివర్శిటి కాలేజ్‌, జ్ఞానాంబిక జట్టు పోటీపడగా 20 ఓవర్లలో జ్ఞానాంబిక కాలేజ్‌ 20ఓవర్లకు పది వికెట్లు కోల్పోయి102పరుగులు చేసింది. ఎస్వీయూ 8వికెట్లు కోల్పోయి 103పరుగులు చేసి గెల ుపొందింది. తరువాత సీకాం డిగ్రీకాలేజ్‌, గేట్‌కాలేజ్‌ మధ్యజరిగిన మ్యాచ్‌లో సీకాం జట్టు గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన సీకాం డిగ్రీ కాలేజ్‌ 20ఓవర్లకు 9వికెట్లు కోల్పోయి, 213 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన గేట్‌కాలేజ్‌ పదివికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఎస్‌డిహెచ్‌ఆర్‌ కాలేజ్‌ శ్రీనివాస డిగ్రీకాలేజ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో శ్రీనివాస డిగ్రీకాలేజ్‌ విజయం సాధించింది. ముందుగా ఎస్‌డిహెచ్‌ఆర్‌ కాలేజ్‌ 20 ఓవర్లకు పదివికెట్లు కోల్పోయి 117 పరుగులు చేయగా, శ్రీనివాస కాలేజ్‌ 121 పరుగులు చేసి గెలుపొందింది. తరువాత జరిగిన ఎస్‌జిఎస్‌, మధర్‌థెరిసా కాలేజ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్‌జిఎస్‌ కాలేజ్‌ గెలుపొందింది. ఎస్‌జిఎస్‌ కాలేజ్‌ 8వికెట్లు కోల్పోయి 171పరుగులు చేయగా మథర్‌తెరిసా కాలేజ్‌ పదివికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN