అంతా మనవైపే చూడాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-25 03:00:00

img
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి : దేశమంతా తెలంగాణ వైపు చూసేలా హైదరాబాద్ 10కే రన్‌ను ఘనంగా, విభిన్నంగా నిర్వహించాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నవంబర్ 24న జరిగే 17వ ఎడిషన్ హైదరాబాద్ 10కే రన్ లోగో, గీతం ఆవిష్కరణ కార్యక్రమం నగరంలో మంగళవారం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగించారు. 2003లో ప్రారంభించిన 10కే రన్ నిర్విరామంగా కొనసాగుతుండడం సంతోషకరమైన విషయమన్నారు. నవంబర్ 24న నెక్లెస్ రోడ్‌లో హైదరాబాద్ 10కే రన్‌తో పాటు ఫ్రీడం ఫ్యామిలీ రన్, కొత్తగా మహిళల కోసమే ప్రత్యేకంగా షీ5రన్‌ను చేపడుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. రన్‌లో పాల్గొనేందుకు ఈవెంట్స్‌నౌ వెబ్‌సైట్ ద్వారా పేర్లను నమోదు చేసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, 10కే రన్ ఫౌండేషన్ డైరెక్టర్ దగ్గుబాటి సురేశ్ బాబు, ఫ్రీడం రేస్ డైరెక్టర్ నన్నపనేని మురళి తదితరులు పాల్గొన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN