అందరి దృష్టీ రోహిత్‌పైనే!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-26 06:24:28

  • టెస్ట్‌ల్లో సుస్థిర చోటుకు మరో చాన్స్‌
  • సౌతాఫ్రికాతో ‘బోర్డ్‌’ మ్యాచ్‌ నేటినుంచి


పరిమిత ఓవర్లలో అతడికి తిరుగులేదు. ప్రత్యర్థి బౌలర్లకు సింహస్వప్నంగా నిలుస్తాడు. మంచినీళ్ల ప్రాయంగా సిక్సర్లు, ఫోర్లు సంధిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తాడు. అలవోకగా సెంచరీలేకాదు డబుల్‌ సెంచరీలూ కొడతాడు. కానీ అంతటి బ్యాట్స్‌మన్‌ టెస్ట్‌ల్లో అదే స్థాయిలో రాణించలేకపోవడం విచిత్రం.. ఇదీ హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ పరిస్థితి. అయితే సుదీర్ఘ ఫార్మాట్‌లో ఇటీవలి కాలంలో ఓపెనర్లు శుభారంభాలు అందించలేకపోతున్న నేపథ్యంలో సెలెక్టర్లు ఈ ముంబైకర్‌కు అవకాశం ఇచ్చి చూడాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే సౌతాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో అతడికి టీమిండియాలో చోటు కల్పించారు. మరి ఈ అవకాశాన్ని అతడు ఏమేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.

విజయనగరం (ఆంధ్రజ్యోతి): టెస్ట్‌ కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభానికి రోహిత్‌ శర్మ అడుగులు వేస్తున్నాడు. చాన్నాళ్ల తర్వాత టెస్ట్‌ తుదిజట్టులో చోటు దక్కించుకోనున్న రోహిత్‌ అందుకు సిద్ధమవుతున్నాడు. ఆ క్రమంలో సౌతాఫ్రికాతో గురువారం ఇక్కడ మొదలయ్యే మూడ్రోజుల మ్యాచ్‌ అతడికి కీలకం కానుంది. అంతేకాదు రోహిత్‌ సారథ్యంలోనే బోర్డు ప్రెసిడెంట్స్‌ లెవెన్‌ జట్టు దక్షిణాఫ్రికాను ఢీకొంటోంది. ఎన్నో ఆశలు పెట్టుకొన్న కేఎల్‌ రాహుల్‌ విఫలమవడంతో స్ట్రోక్‌ప్లేలో సిద్ధహస్తుడైన రోహిత్‌పై సెలెక్టర్లు నమ్మకముంచారు. టెస్ట్‌ల్లోనూ అతడిని ఓపెనర్‌గా పంపాలని నిర్ణయించారు. దాంతో 32 ఏళ్ల రోహిత్‌కు రాబోయే ఐదు టెస్ట్‌లు జీవన్మరణంగానే భావించాలి. మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి రోహిత్‌ బోర్డు ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. వచ్చేనెల రెండున విశాఖపట్నంలో మొదలు కానున్న తొలి టెస్ట్‌కు ముందు రోహిత్‌, మయాంక్‌ తమను తాము పరీక్షించుకొనేందుకు ఈ మూడు రోజుల మ్యాచ్‌ చక్కటి వేదిక కానుంది.

స్ట్రోక్‌ ప్లేయర్‌ అయినా..

ఆధునిక క్రికెట్‌లో గొప్ప బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన రోహిత్‌ ఇప్పటిదాకా కేవలం 27 టెస్ట్‌లే ఆడడం గమనార్హం. ఇందులో 39.62 సగటుతో మూడు సెంచరీలతో 1585 రన్స్‌ చేయడం అతడి స్థాయికి తగ్గ ప్రదర్శన కాదు. వైస్‌కెప్టెన్‌ అజింక్యా రహానె, తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి మిడిలార్డర్‌లో పాతుకుపోవడంతో టెస్ట్‌ల్లో రోహిత్‌ టాపార్డర్‌లో రావడం తప్పనిసరైంది. రబాడ, ఫిలాండర్‌, ఎంగిడితో పటిష్ఠంగా ఉన్న సౌతాఫ్రికా బౌలింగ్‌ను ఎదుర్కోవాల్సి ఉండడ ంతో తొలి టెస్ట్‌కు ముందు రోహిత్‌కు ఈ మ్యాచ్‌ రిహార్సల్‌గా చెప్పాలి. అమితంగా స్వింగయ్యే ఎర్ర బంతులను ఎదుర్కోవడంలో రోహిత్‌ టెక్నిక్‌ అంతంత మాత్రమే. అయినా.. టెస్ట్‌ల్లో సెహ్వాగ్‌ అద్భుతంగా రాణించిన తీరును దృష్టిలో పెట్టుకున్న కెప్టెన్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్ర్తిలు రోహిత్‌పట్ల మొగ్గుచూపారు. వారి ప్రయోగం ఫలిస్తే సరి.. లేదంటే గిల్‌, అభిమన్యు ఈశ్వరన్‌, ప్రియాంక్‌ వంటి యువ ఆటగాళ్లు ఓపెనర్‌ స్థానాన్ని భర్తీ చేసేందుకు రెడీగా ఉన్నారు. అంతేకాదు..దేశవాళీల్లో మళ్లీ భారీగా పరుగులు సాధిస్తే రాహుల్‌, డోపింగ్‌ నిషేధం పూర్తయ్యాక పృథ్వీ షా కూడా ఓపెనర్ల రేసులోకి వస్తారు. ఉపఖండంలోని ఫ్లాట్‌ పిచ్‌లపై రోహిత్‌ రాణించినా..పేసర్లకు స్వర్గథామమైన న్యూజిలాండ్‌ పిచ్‌లపై ట్రెంట్‌ బౌల్ట్‌ తదితర బౌలర్లను అతడు ఎదుర్కోగలడా అన్నది ప్రశ్నార్థకమే. మొత్తంగా..టె్‌స్టల్లో తన స్థానం సుస్థిరం చేసుకోవాలని పట్టుదలగా ఉన్న రోహిత్‌కు రాబోయే ఆరు నెలలు పరీక్షా కాలమే. రోహిత్‌తోపాటు ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఉమేశ్‌ యాదవ్‌పైనా అందరి దృష్టి నిలిచింది. వెన్ను గాయంతో వైదొలగిన బుమ్రా స్థానంలో అతడు టెస్ట్‌ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

భరత్‌కూ కీలకం..

తెలుగు ఆటగాడు కేఎస్‌ భరత్‌కు కూడా ఈ పోరు కీలకమే. చక్కని కీపింగ్‌తో బాటు సమర్థుడైన బ్యాట్స్‌మన్‌ అయిన భరత్‌ టె్‌స్టల్లో కీపర్‌ రేస్‌లో నిలిచాడు. ఇప్పటికిప్పుడుకాకున్నా..పంత్‌, సాహా ఆశించిన రీతిలో రాణించకపోతే సెలెక్టర్లు భరత్‌పై మొగ్గుచూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాంతో తనకు దక్కిన ప్రతి చాన్స్‌ను అతడు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది.

బోర్డు ప్రెసిడెంట్స్‌ లెవెన్‌

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, ప్రియాంక్‌ పాంచల్‌, ఎఆర్‌.ఈశ్వరన్‌, కరుణ్‌ నాయర్‌, సిద్ధార్థ్‌ లాడ్‌, కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), జలజ్‌ సక్సేనా, ధర్మేం ద్ర జడేజా, అవేశ్‌ ఖాన్‌, ఇషాన్‌ పొరెల్‌, శార్దూల్‌ ఠాకూర్‌,

ఉమేశ్‌ యాదవ్‌.

సౌతాఫ్రికా టెస్ట్‌ జట్టు

డుప్లెసి (కెప్టెన్‌), బవుమా (వై్‌సకెప్టెన్‌), బ్రయన్‌, డి కాక్‌, ఎల్గర్‌, హంజా, కేశవ్‌ మహరాజ్‌, మార్‌క్రమ్‌, సెనురన్‌, ఎంగిడి, అన్రిచ్‌, ఫిలాండర్‌, పీడిట్‌, రబాడ, రూడీ సెకండ్‌.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN