అగ్రస్థానాన్ని కోల్పోయిన మంధాన
- ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన టాప్ ర్యాంక్‌ను కోల్పోయింది. మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌కు న్యూజిలాండ్‌కు చెందిన అమీ సట్టెర్త్వైట్కు ఎగబాకింది. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు స్మృతి గాయం కారణంగా పాల్గొనలేదు. దీంతో ఆమె ఖాతాలో 755 రేటింగ్ పాయింట్లు మాత్రమే ఉండడంతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక మిథాలీరాజ్ 7వ స్థానంలో, టీ20 కెప్టెన్ మిథాలీరాజ్ వన్డేల్లో 17వ ర్యాంక్‌కు చేరారు. ఇక బౌలర్ల జాబితాలో జులన్ గోస్వామి(6), శిఖా పాండే(8), పూనమ్ యాదవ్ 9వ ర్యాంక్‌కు చేరుకున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ ఇక స్థానం దిగజారి మూడో స్థానంలో నిలవగా... శిఖా పాండే టాప్-10లో చోటు దక్కించుకుంది.
