అతని ఎత్తు 8.2 అడుగులు.. చూసేందుకు ఎగబడ్డ జనం..

News18

News18

Author 2019-11-07 11:36:31

img

ఉత్తరప్రదేశ్‌లోని లక్నో‌లో ఉన్న ఇకాన స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్-వెస్టిండీస్‌ జట్ల మధ్య బుధవారం వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ కంటే.. మ్యాచ్‌ని చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి వార్తల్లో ఎక్కువగా హైలైట్ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన షేర్ ఖాన్ అనే ఆ వ్యక్తి.. తన ఎత్తు కారణంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని ఎత్తు 8 అడుగుల 2 అంగుళాలు. క్రికెట్ ఫ్యాన్ అయిన అతను ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూసేందుకు లక్నోకి వచ్చాడు. అయితే అతని ఎత్తు కారణంగా లక్నోలో ఏ హోటల్ అతనికి రూమ్ ఇవ్వలేదు. చాలా హోటల్స్‌ను సంప్రదించి చివరకు నాకా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. పోలీసులు అతని ధ్రువీకరణ పత్రాలన్నీ పరిశీలించి చివరకు ఓ హోటల్లో బస కల్పించారు.దీంతో ఆ హోటల్ బయట అతన్ని చూసేందుకు గుంపుగుంపులుగా జనం గుమిగూడారు. జనం అతన్ని చూసేందుకు వెంటపడుతుండటతో హోటల్ నుంచి క్రికెట్ స్టేడియం వరకు పోలీసులే అతన్ని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, 30 ఏళ్ల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌కి లక్నో వేదికైంది.1989లో పాకిస్తాన్-శ్రీలంక మధ్య చివరిసారిగా ఇక్కడ వన్డే మ్యాచ్ జరిగింది. తాజాగా ఆఫ్ఘన్ వర్సెస్ విండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 45.2ఓవర్లలో 194 పరుగులు చేయగా.. విండీస్ 46.3ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి విండీస్ లక్ష్యాన్ని చేధించింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD