అత్యుత్తమ కెప్టెన్‌ విరాటే..!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-11 06:55:58

img

న్యూఢిల్లీ: ‘ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు.. కానీ నా ఉద్దేశంలో విరాట్‌ కోహ్లీయే అత్యుత్తమ కెప్టెన్‌’ అని వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కితాబిచ్చాడు. ‘అత్యధిక టెస్ట్‌ విజయాలు సాధించిన భారత సారథిగా విరాట్‌ టాప్‌లో ఉన్నాడు. అలా చూస్తే ఇతరుల కంటే అతడు బాగా ఆడుతున్నట్టే..! దీంతో మిగతా వారు ఏకీభవిస్తారా? అంటే అది వారి అభిప్రాయం. నా దృష్టిలో మాత్రం నాయకుడిగా అతడు తన పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాడు. భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ ఎలా నెగ్గాలో చూపిస్తున్నాడు. తనపై పెట్టుకున్న అంచనాలను అతడు అందుకుంటున్నాడ’ని భజ్జీ అన్నాడు. రోహిత్‌ శర్మను మరొకరితో పొల్చడం కష్టమే అయినా.. సెహ్వాగ్‌ తరహాలోనే అతడు కూడా ఓపెనర్‌గా అదరగొడతాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN