అనంతపురం, నెల్లూరు మ్యాచ్‌ డ్రా

Prajasakti

Prajasakti

Author 2019-10-01 03:55:55

img

ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్‌ :
అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సిఎస్‌ఆర్‌ శర్మ కళాశాల క్రీడామైదానంలో అండర్‌-14 గ్రూపు బి మ్యాచ్‌లలో భాగంగా అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓవర్‌ నైట్‌ స్కోరు 139/1తో ఆట ప్రారంభించిన అనంతపురం జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు నష్టపోయి 382 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ జట్టులో బి.ప్రశాంత్‌ 154(159 బంతుల్లో 30 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇతనికి తోడు సి.భార్గవ్‌ రాజు 93 పరుగులకు చేసి జట్టు భారీ స్కోరుకి దోహదపడ్డారు. నెల్లూరు బౌలర్‌లలో ఎస్‌.భార్గవ్‌ మహేష్‌, కెబివిఎన్‌ గణేష్‌ చెరో రెండు వికెట్లతో రాణించారు. అనంతపురం జట్టు 260 పరుగుల విజయలక్ష్యాన్ని నెల్లూరు జట్టుకి నిర్ధేశించింది. నెల్లూరు జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.
ఈ జట్టులో బి.అర్జున్‌ 62(110 బంతుల్లో; 12 ఫోర్లు), జి.మోనీష్‌ 27 పరుగులు సాధించారు. అనంతపురం బౌలర్‌లలో షేక్‌ సాహిల్‌, సివి రాఘవేంద్ర శ్రీరామ్‌ చెరో వికెట్‌ సాధించారు. మ్యాచ్‌ ఫలితం తేలే అవకాశం లేకపోవటంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన నెల్లూరు జట్టుకి 3 పాయింట్లు, అనంతపురం జట్టుకి 1 పాయింట్‌ దక్కాయి. మ్యాచ్‌ను క్రికెట్‌ ప్రకాశం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ నామినేని కిరణ్‌కుమార్‌, సిహెచ్‌ ప్రతాప్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN