అభిమాని అత్యుత్సాహం అదుపుతప్పి కిందపడిన రోహిత్‌శర్మ

Nava Telangana

Nava Telangana

Author 2019-10-13 10:55:00

పుణె: టీమిండియా 'హిట్‌మ్యాన్' రోహిత్‌శర్మ కాళ్లను ముద్దాడాలన్న ఓ అభిమాని అత్యుత్సాహం మైదానంలో కొంత గందరగోళానికి దారితీసింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజైన శనివారం ఈ ఘటన జరిగింది. లంచ్ విరామం తర్వాత ఫీల్డింగ్ చేసేందుకు భారత ఆటగాళ్లు మైదానంలోకి వచ్చారు. ఆ తర్వాత కాసేపటికే ఓ అభిమాని ఫెన్సింగ్ దాటి రోహిత్‌వైపు దూసుకొచ్చాడు. ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ వద్దకు పరిగెత్తుకుంటూ వేగంగా వచ్చిన అభిమాని అతడి పాదాలను ముద్దాడే ప్రయత్నం చేస్తూ అతడి కాళ్లపై పడ్డాడు. ఈ క్రమంలో రోహిత్ అదుపుతప్పి కిందపడ్డాడు. అప్పటికి తేరుకున్న భద్రతా సిబ్బంది వెంటనే వచ్చి ఆ అభిమానిని పట్టుకుని దూరంగా తీసుకెళ్లారు. అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న రహానే నవ్వుకున్నాడు. రోహిత్‌కు ఇలాంటి అనుభవం ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. గతంలో విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబై-బీహార్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి ఘటనే ఎదురైంది. గతేడాది హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీని ఓ అభిమాని ముద్దాడాడు. ఇక, ధోనీకి అయితే ఇలాంటి అనుభవాలు లెక్కలేనన్ని.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN