అభిమానులను ఉసూరుమనిపించిన రోహిత్

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-10 21:51:30

img

నాగ్‌పూర్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రెండో టీ20లో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించిన కెప్టెన్ రోహిత్‌శర్మ ఈసారి 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. షఫియుల్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి రోహిత్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమ ఉజ్జీలుగా ఉన్నాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన వారికి సిరీస్ సొంతమవుతుంది. కాగా, ప్రస్తుతం నాలుగు ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. ధవన్ 11, లోకేశ్ రాహుల్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN