అమన్ సంఘీ పసిడి గురి

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-19 04:57:00

img
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ రైఫిల్ అసోసియేషన్(టీఆర్‌ఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న సౌత్‌జోన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో యువ షూటర్ అమన్ సంఘీ అదరగొట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల వ్యక్తిగత క్లే పీజియన్ స్కీట్ షూటింగ్ విభాగంలో అమన్ 34 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. రాష్ర్టానికే చెందిన హసన్ బిన్ (32)కు రజతం దక్కగా, నలిన్ (30)కు కాంస్యం లభించింది. మిగతా విభాగాల్లో యశ్వంత్, వెంకట లక్ష్మి, మునెక్ బత్తుల, ఆయూష్ రుద్రరాజు, రాజా రాజగోపాల్, వికార్ అహ్మద్ స్వర్ణ పతకాలతో ఆకట్టుకున్నారు. విజేతలకు మాజీ డీజీ పీ అనురాగ్ శర్మ, టీఆర్‌ఏ అధ్యక్షుడు అమిత్ సంఘీ, ఉదయ్ పిలానీ పతకాలు ప్రదానం చేశారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD