అయ్యర్ సిక్సర్ల హోరు... నాగ్ పూర్ లో భారత్ భారీ స్కోరు..

Ap7am

Ap7am

Author 2019-11-10 23:29:00

img

  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 174 పరుగులు
  • నిరాశపర్చిన రోహిత్ శర్మ
  • అయ్యర్, రాహుల్ ఫిఫ్టీలు
బంగ్లాదేశ్ తో చివరిదైన మూడో టి20 మ్యాచ్ లో యువ భారత్ భారీ స్కోరు సాధించింది. నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ కు దిగింది. అయితే, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశకు గురిచేస్తూ 2 పరుగులకే అవుటయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను యువ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ స్వీకరించారు.

రాహుల్ 35 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేయగా, అయ్యర్ 33 బంతుల్లోనే 62 పరుగులు సాధించాడు. బంగ్లా బౌలర్లపై విరుచుకుపడిన అయ్యర్ 3 ఫోర్లు, 5 భారీ సిక్సులు సంధించాడు. చివర్లో మనీష్ పాండే 13 బంతుల్లో చకచకా 22 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 174 పరుగులు సాధించింది. బంగ్లా బౌలర్లలో షఫియుల్ ఇస్లాం, సౌమ్య సర్కారు చెరో రెండు వికెట్లు తీశారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN