అరంగేట్రంలో ఘోర పరాజయం

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-26 06:05:00

img

-ఏటీకే చేతిలో 0-5తో హైదరాబాద్ ఓటమి
కోల్‌కతా : ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) అరంగేట్రం మ్యాచ్‌లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్‌ఎఫ్‌సీ) జట్టు భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 0-5 తేడాతో అథ్లెటికో డీ కోల్‌కతా(ఏటీకే)పై ఓడిపోయింది. డేవిడ్ విలియమ్స్ (25, 44వ నిమిషాలు), రాయ్ కృష్ణ (27వ ని.) గోల్స్‌తో అదరగొట్టడంతో తొలి అర్ధభాగంలోనే 3-0తో ఆధిక్యంలో నిలిచిన ఏటీకే జట్టు... మ్యాచ్ ముగిసేందుకు రెండు నిమిషాల ముందు, ఎక్స్‌ట్రా టైమ్‌లో గ్రేసియా డబుల్ గోల్స్ సాధించడంతో సొంత మైదానంలో భారీ విజయం సాధించింది. ఏటీకే దూకుడుకు హెచ్‌ఎఫ్‌సీ ఏ దశలోనూ కళ్లెం వేయలేకపోయింది. డిఫెన్స్‌లో పూర్తిగా విఫలం కాగా, వచ్చిన ఆరు పెనాల్టీ కార్నర్ అవకాశాలను చేజార్చుకుంది. మ్యాచ్ 19వ నిమిషంలోనే ఏటీకే ఆటగాడు మైఖేల్ సుసాయిరాజ్ మంచి షాట్ కొట్టగా.. కొద్దిలో గోల్ మిస్సయింది. 25వ నిమిషంలో హెర్నాండెజ్ అద్భుంతగా బంతిని పాస్ చేయడంతో హైదరాబాద్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించిన విలియమ్స్.. ఏటీకే ఖాతా తెరిచాడు. మరో రెండు నిమిషాల్లోనే రాయ్ కృష్ణ కూడా గోల్ చేయడంతో హైదరాబాద్ ఒత్తిడిలో పడింది.
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD