అలా ముందుకెళ్లడమే నా పని: రోహిత్

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-02 22:43:31

img

న్యూఢిల్లీ: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య ఆదివారం (3న) ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. తన పని చాలా సులభమని, కోహ్లీ విడిచిపెట్టిన చోటు నుంచి జట్టును ముందుకు ముందుకు నడిపించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. గతంలో తనకు అవకాశాలు లభించినప్పుడు ఎలాగైతే చేశానో, ఇప్పుడు కూడా వాటిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నాడు.గతేడాది రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది.

ప్రత్యర్థి బంగ్లాదేశ్ జట్టులో అగ్రశ్రేణి ఆటగాళ్లు షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్ లేనంత మాత్రాన తేలిగ్గా తీసుకోబోమన్నాడు. బంగ్లాదేశ్ చాలా మంచి జట్టు అని రోహిత్ ప్రశంసించాడు. స్వదేశంలోనే కాక విదేశాల్లోనూ వారు అత్యుత్తమంగా రాణించారని కితాబిచ్చాడు. ముఖ్యంగా తమతో ఆడినప్పుడు తమను తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తారని పేర్కొన్నాడు. కాబట్టి ఆ జట్టును ప్రత్యేకంగానే పరిగణిస్తామని అన్నాడు. షకీబ్, తమీమ్‌లు లేకపోయినా ఆ జట్టులో పరిణితి చెందిన ఆటగాళ్లు ఉన్నారన్నాడు. వాళ్లదైన రోజున ఏ జట్టునైనా కలరవపెట్టగలరన్నాడు. ఢిల్లీలో కాలుష్యంపై రోహిత్ మాట్లాడుతూ.. కాలుష్యం కొంత కలవరపెడుతున్నట్టు చెప్పాడు. అయితే, తాను గతంలో ఇక్కడ ఆడానని, ఎలాంటి సమస్య ఎదురుకాలేదని అన్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN