అలీసా రికార్డుల మోత

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-03 05:24:00

img
సిడ్నీ : ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌ అలీసా హేలీ రికార్డులను తిరగరాసింది. శ్రీలంకతో బుధవారం ఇక్కడ జరిగిన టీ20లో అజేయంగా 61 బంతుల్లోనే 148 పరుగులు (19ఫోర్లు, 7సిక్సర్లు) చేసి... టీ20 మహిళా క్రికెట్‌లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. అంతకు ముందు ఆసీస్‌కే చెందిన మెగ్‌ లానింగ్‌(133) పేరిట ఆ రికార్డు ఉండేది. 46 బంతుల్లోనే 100పరుగులు చేసిన అలీసా టీ20ల్లో వేగంగా శతకం పూర్తి చేసిన ఆస్ట్రేలియన్‌ గానూ రికార్డులకెక్కింది. అలీసా హేలీ చివరి వరకు చెలరేగి ఆడడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 20ఓవర్లలో రెండు వికెట్లకు 226 పరుగులు చేసింది. బదులుగా శ్రీలంక పూర్తి ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 97 పరుగులే చేయగలిగింది. 132 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ భారీ విజయం సాధించింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN