ఆంధ్ర, కర్ణాటక మ్యాచ్ డ్రా

Prajasakti

Prajasakti

Author 2019-11-03 06:05:22

img

ప్రజాశక్తి- ఒంగోలు కలెక్టరేట్‌
ఆంధ్ర, కర్ణాటక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. క్రికెట్‌ ప్రకాశం ఆధ్వర్యంలో ఒంగోలు సిఎస్‌ఆర్‌ శర్మ కళాశాల క్రీడామైదానంలో అండర్‌-16 విజయ్‌ మర్చంట్స్‌ ట్రోఫీలో భాగంగా ఆంధ్ర, కర్ణాటక జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓవర్‌ నైట్‌ స్కోరు 99/2తో ఆట ప్రారంభించిన ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ జట్టులో ఎం.అభినవ్‌ 55(125 బంతుల్లో;) పరుగులు, కెప్టెన్‌ ఎస్‌కె రషీద్‌ 54(183 బంతుల్లో) పరుగులు చేసి జట్టు స్కోరుకి దోహద పడ్డారు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ కర్ణాటక బౌలర్లకు దాసోహమయ్యారు. కర్ణాటక బౌలర్‌ విశాల్‌ కుమార్‌ 38 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించటం గమనార్హం. కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఈ జట్టులో ఎస్‌.చైతన్య 83(97 బంతులో) పరుగులు, ఎస్‌.సంతోష్‌ 25 పరుగులు చేశారు. ఆంధ్ర బౌలర్‌లలో జి.మల్లికార్జున 60 పరుగులిచ్చి 4 వికెట్లు, జి.పార్ధసారధి 64 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించారు. మ్యాచ్‌కు సమయం లేకపోవటంతో డ్రాగా ముగిసింది.

ొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగుల ఆధిక్యం పొందిన కర్ణాటక జట్టుకి మూడు పాయింట్లు, ఆంధ్ర జట్టుకి 1 పాయింట్‌ దక్కాయి. మ్యాచ్‌ రిఫరీగా వనిత, బిసిసిఐ ప్యానల్‌ అంపైర్లు సత్రజిత్‌ లహరి, భారతి విజ్‌ వ్యవహరించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD