ఆఖర్లో చేతులెత్తేసిన హైదరాబాద్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-07 05:37:42

img

  • ఐఎస్‌ఎల్‌లో నార్త్‌ఈస్ట్‌ విజయం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో హైదరాబాద్‌కు మరో పరాభవం ఎదురైంది. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్‌ జట్టు 1-0తో హైదరాబాద్‌పై గెలిచింది. ఈ విజయంతో నార్త్‌ఈస్ట్‌ 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. హైదరాబాద్‌ 3 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. హోం గ్రౌండ్‌ అడ్వాంటేజ్‌తో మ్యాచ్‌ తొలి క్వార్టర్‌లో దూకుడుగా ఆడిన హైదరాబాద్‌.. ఆ తర్వాత కూడా నార్త్‌ఈస్ట్‌ను సమర్థంగా ఎదుర్కొంది. సార్ట్‌ స్ట్రయికర్‌ మార్సిలిన్హోకు తోడు రిడీమ్‌, గ్యాన్‌ అంచనాలకు తగ్గట్టు రాణించడంతో తుది వరకు ఈశాన్య జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది. మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా నార్త్‌ఈ్‌స్టకు పెనాల్టీ కిక్‌ వరంలా లభించింది. పెనాల్టీ కిక్‌ను ఆ జట్టు స్ట్రయికర్‌ మాక్సీ బారిరో గోల్‌గా మలచడంతో హైదరాబాద్‌కు షాక్‌ తగిలింది. ఆఖర్లో హైదరాబాద్‌ పోరాడినా ఫలితం లేకపోయింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD