ఆచితూచి ఆడుతున్న సఫారీలు…
పూణె:టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఫాలో ఆన్ దిశగా పయనిస్తోంది. 77 ఓవర్లకు ఎనిమిది వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్(64) అత్యధిక స్కోర్ సాధించగా ప్రస్తుతం కేశవ్ మహారాజ్(21; 50 బంతుల్లో4×4), ఫిలాండర్(23; 111 బంతుల్లో 3×4) ఆచితూచి ఆడుతున్నారు. ఈ రోజు ఇంకా 23 ఓవర్ల ఆట మిగిలి ఉండగా దక్షిణాఫ్రికా 404 పరుగుల వెనుకంజలో ఉంది.