ఆటపట్టు రికార్డు సెంచరీ

Prajasakti

Prajasakti

Author 2019-09-30 13:14:25

img

* తొలి టీ20లో ఆసీస్‌ విజయం
సిడ్ని : శ్రీలంక మహిళా టీ20 జట్టు కెప్టెన్‌ చమారి ఆటపట్టు రికార్డు సెంచరీ వృధాగా మారింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో శ్రీలంక 41 పరుగులతో పరాజయం చెందింది. ఆసీస్‌ విధించిన 218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకలో ఓపెనర్‌, కెప్టెన్‌ ఆటపట్టు శతకంతో కదం తొక్కింది. 66 బంతులు ఆడిన ఆటపట్టు ఆరు సిక్స్‌లు, 12 ఫోర్లతో 133 పరుగులు చేసింది. 17.4 ఓవర్‌లో నాలుగో వికెట్‌గా అవుటయంది. ఆటపట్టు మినహా మిగిలిన క్రికెటర్లు పెద్దగా రాణించకపోవడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ల 1-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది. బెత్‌ మూనీ శతకంతో విజృంభించింది. 61 బంతుల్లో 20 ఫోర్లతో 113 పరుగులు చేసింది. మరో ఓపెనర్‌ హీలీ 43 పరుగులు, గార్డెన్‌ 49 పరుగులు చేశారు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. లక్ష్య సాధనలో శ్రీలంక కెప్టెన్‌ ఆటపట్టు శతకం చేసినా తన జట్టును గెలిపించుకోలేకపోయంది. అయితే ఛేజింగ్‌లో సెంచరీ చేసిన తొలి మహిళా కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పింది. పురుషుల టీ20లో నేపాల్‌ కెప్టెన్‌ ఖడ్కా రికార్డు నెలకొల్పిన తరువాత రోజే ఆటపట్టు మహిళా విభాగంలో ఈ రికార్డు నెలకొల్పడం విశేషం.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD