ఆఫ్ఘన్‌పై రెండో వన్డేలో గెలుపు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-11-10 05:43:00

img
లక్నో : భారత్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే వెస్టిండీస్ కైవసం చేసుకుంది. బౌలర్లు కాట్రెల్, చేజ్, వాల్ష్ చెరో మూడు వికెట్లతో చెలరేగడంతో శనివారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో విండీస్ 47 పరుగుల తేడాతో ఆఫ్ఘన్‌ను చిత్తుచేసింది. పూరన్(67), లూయీస్(54) అర్ధశతకాలతో రాణించడంతో తొలుత విండీస్ 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో నజీబుల్లా జర్దాన్(56) మినహా మరెవరూ రాణించలేకపోవడంతో ఆఫ్ఘనిస్థాన్ 45.4 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కరీబీయన్ జట్టుకు ఓపెనర్లు షాయ్ హోప్(43), ఎడ్వర్డ్ లూయీస్(54) చక్కటి ఆరంభాన్నిచ్చారు. హోప్‌ను ఎల్బీడబ్ల్యూ చేసి ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్‌ఖాన్ 98 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత లూయీస్, చేజ్(9) వెనువెంటనే వెనుదిరిగినా... హిట్మైర్(34) నిలకడగా ఆడాడు. అతడికి తోడైన నికోలస్ పూరన్(67) ధాటిగా ఆడాడు. ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అవడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247పరుగులే చేయగలిగింది. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీనుల్ హక్ మూడు వికెట్లతో రాణించాడు. లక్ష్యఛేదనలో ఆఫ్ఘనిస్థాన్ ఆపసోపాలు పడింది. ప్రారంభంలోనే జావేద్(0) పెవిలియన్ బాట పట్టగా.. హజ్రతుల్లా జజాయ్(23), విక్రమ్ అలీఖిల్(19), అస్గర్ ఆఫ్ఘన్(3) అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో ఆఫ్ఘన్ 79 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కషాల్లో పడింది. ఆ సమయంలో నజీబుల్లా జార్దాన్, మహమ్మద్ నబీ(32) కాసేపు సాధికారికంగా ఆడినా ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఆఫ్ఘన్ ఓటమి పాలైంది. విండీస్ బౌలర్లలో కాట్రెల్, రోస్టన్ చేజ్, హేడెన్ వాల్ష్ చెరో మూడు వికెట్లతో అదరగొట్టారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN