ఆఫ్ఘాన్ కోచ్‌గా క్లూసెనర్

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-28 04:25:00

కాబూల్: దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ కోచ్‌గా ఎన్నికయ్యాడు. వెస్టిండీస్‌కు చెందిన ఫిల్ సిమన్స్ గడువు ప్రపంచకప్‌తోనే ముగియడంతో అతడి స్థానంలో ఆఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) శుక్రవారం క్లూసెనర్‌ను ఎంపిక చేసింది. ఈ పదవి కోసం మొత్తం 50 మంది పోటీపడగా.. క్లూసెనర్‌కు అవకాశం దక్కింది. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా టీ20 జట్టుకు సహాయక బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించిన క్లూసెనర్.. ఈ ఏడాది నవంబర్‌లో ఆఫ్ఘాన్ జట్టుతో చేరనున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో తమదైన ముద్ర వేస్తున్న జట్టుతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. అత్యుత్తమ జట్టుగా ఎదిగేందుకు ఆఫ్ఘాన్ కుర్రాళ్లకు మంచి అవకాశం ఉంది అని క్లూసెనర్ పేర్కొన్నాడు. 48 ఏండ్ల క్లూసెనర్ దక్షిణాఫ్రికా తరఫున 49 టెస్టులు, 171 వన్డేలు ఆడాడు. అతడికి గతంలో ముంబై ఇండియన్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా.. దక్షిణాఫ్రికా జాతీయ అకాడమీలో బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN