ఆయుష్ పథకం ద్వారా మరో 19 రోగాలకు చికిత్స!

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-09-25 01:59:19

img

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: సామాన్య ప్రజలకు ఉచిత వైదాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్ పథకం జాబితాలో మరో 19 రోగాలు చేరనున్నాయి. వాటికి ప్యాకేజీలను ప్రకటించాలని ఆయూష్ మంత్రిత్వ శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
ప్రధాన మంత్రి ఆరోగ్య యోజన పథకం కింద ఉచిత వైద్య సౌకర్యాన్ని మరో 19 రోగాలకు కూడా వర్తింప చేయాలని ఆ ప్రతిపాదనలో సూచించినట్టు ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేష్ కొటెచా తెలిపారు. ఆయుష్ కమిటీ సమావేశమై, 19 ప్యాకేజీలను ఖరారు చేసి, ప్రతిపాదనను కేంద్రానికి పంపిందని అన్నారు. కాగా, కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ ఈ ప్రతిపాదన విషయాన్ని ధ్రువీకరించారు. గత వంద రోజుల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించిందని అన్నారు. ఆయుష్ వైద్య సేవలతోపాటు, బీమా ప్యాకేజీని మరింత విస్తృత పరిచేందుకు మార్గదర్శకాలను ఖరారు చేశామని చెప్పారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకుగాను, వివిధ రాష్ట్రాలకు 325 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు చెప్పారు. నీతి ఆయోగ్, ఇనె్వస్ట్ ఇండియాతో కలిసి ఆయుష్ పథకం అమలవుతున్నదని తెలిపారు. ఆధునిక ఔషధాలను ఈ పథకం కిందకు తెస్తున్నట్టు చెప్పారు. అలోపతిలో వైద్యం చేయించుకనే వారికి ఆరోగ్య బీమా పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN