ఆరేళ్ళ తరువాత మరో సెహ్వాగ్ ని వెతికి పట్టుకున్న భారత్.

Teluguin

Teluguin

Author 2019-10-07 10:25:25

img

సెహ్వాగ్ ఈ పేరు చెప్పగానే ప్రత్యర్థి బౌలర్లకు నిద్ర కూడా పట్టదు. ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సెహ్వాగ్ ప్రత్యర్థి టీం లకు చాలాసార్లు తన బాటింగ్ తో చుక్కలు చూపించాడు. మెరుపువేగం తో బంతులను బౌండరీలు దాటించే సత్తా ఒక్క వీరేంద్ర సెహ్వగ్ కి మాత్రమే సొంతం. భారత్ తరుపున ఎన్నో రికార్డులని సాధించిన ఘనత సెహ్వాగ్ ది. అయితే విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ టీం ఇండియా కి మరో సెహ్వాగ్ దొరికాడు అంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రోహిత్ శర్మ వైజాగ్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలోను రెండూ శతకాలు బాదాడు. మొదటి శతకం కంటే రెండో శతకం అత్యంత వేగంగా సాధించాడు. రోహిత్ శర్మ బాటింగ్ చూస్తుంటే సెహ్వాగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ గుర్తొస్తున్నాయని చాల మంది క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు అన్నారు. తాజాగా రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచుల్లో ఓపెనర్ గా రాణించడం పట్ల ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు అభిమానులు. మొదటి టెస్ట్ మ్యాచులో టీం ఇండియా భారీ విజయాన్ని దక్కించుకోవడం లో కీలక పాత్ర పోషించారు రోహిత్ శర్మ. టీం కష్టాల్లో వున్నపుడు రోహిత్ ఆదుకోగలడు అనే నమ్మకాన్ని ఇచ్చాడు అని, 2013 లో సెహ్వాగ్ చివరగా భరత్ తరపున ఆడాడు. ఆరేళ్ళ తరువాత రోహిత్ శర్మ ద్వారా టీం ఇండియా మరో సెహ్వాగ్ ని వెతికి పట్టుకుంది అంటూ ప్రశంసలు కురిపించారు రాజ్ కుమార్.

ప్రపంచ కప్ లో వరుస సెంచరీలు చేసిన రోహిత్ శర్మ వన్డేల్లో ఎపుడో తన సత్తా చాటాడు, తాజాగా ఇపుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకా, భారత్ కి మరిన్ని విజయాల్ని అందించడానికి రోహిత్ శర్మ సిద్ధంగా వున్నారు అంటూ విమర్శకులు కూడా భావిస్తున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN