ఆర్చరీలో శివాని రికార్డులు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-25 07:54:39

విజయవాడ (ఎడ్యుకేషన్), అక్టోబర్ 24: చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీకి చెందిన డాలీ శివాని ఆర్చరీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్‌లను సృష్టించింది. విజయవాడలోని విఎంసీ ఓల్గా ఆర్చరీ అకాడమీలో జరిగిన రికార్డ్ కార్యక్రమంలో శివాని రికర్వ్ విభాగంలో 15+15 మీటర్ల దూరంలో 32నిమిషాల్లో 72 బాణాలు సంధించి 720 పాయింట్లకు గాను 710 పాయింట్లు సాధించి రికార్డ్ నెలకొల్పింది. శివాని గతంలో పలు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్‌లను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధి నిరజారాయ్ చౌదరి ప్రకటించి సర్ట్ఫికెట్‌తో పాటు పతకాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ చిన్నారి డాలీ శివాని అతి చిన్న వయస్సులో రికార్డులు నెలకొల్పడం అభినందనీయమన్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN