ఆసీస్‌దే టీ20 సిరీస్

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-31 02:50:00

img
బ్రిస్బేన్: సొంతగడ్డపై ఆస్ట్రేలియా అదరగొడుతున్నది. బుధవారం జరిగిన రెండో టీ20లో లంకపై ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక.. ఆసీస్ బౌలర్లు బిల్లీ స్టాన్‌లేక్ (2/23), కమ్మిన్స్ (2/29), అగర్ (2/27), ఆడమ్ జంపా(2/20) రాణింపుతో 19 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కుశాల్ పెరెర (27), గుణతిలక (21) మినహా జట్టులో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్‌కు కెప్టెన్ ఫించ్(0) ఔట్ రూపంలో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే వార్నర్ (60 నాటౌట్), స్మిత్ (53 నాటౌట్) అజేయ అర్ధసెంచరీలతో ఆసీస్ మరో ఏడు ఓవర్లు మిగిలుండగానే విజయాన్నందుకుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD