ఆసీస్‌ అమ్మాయిల ప్రపంచ రికార్డు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-10 06:30:22

  • వరుసగా 18 వన్డేల్లో గెలుపు జూ 3-0తో లంకపై సిరీస్‌ కైవసం

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా అమ్మాయిల వన్డే క్రికెట్‌ జట్టు వరుసగా 18 విజయాలు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శ్రీలంకతో ఆఖరి, మూడో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి.. 3-0తో సిరీస్‌ కైవసం చేసుకోవడంతో ఆసీ్‌సకు ఈ ఘనత దక్కింది. 17 వరుస విజయాలతో ఉన్న 20 ఏళ్లనాటి తమ రికార్డునే ఆసీస్‌ తిరగరాసింది. కాగా, బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత చమరి జయాంగిని (103) సెంచరీతో రాణించడంతో.. లంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 195 పరుగులు సాధించింది. అనంతరం హీలీ (112) విజృంభించడంతో.. ఆసీస్‌ 26.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 196 రన్స్‌ చేసి నెగ్గింది. రేచల్‌ హేన్స్‌ (63) హాఫ్‌ సెంచరీతో మెరిసింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN