ఆ ఇద్దరి వల్లే

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-21 03:09:00

-కోహ్లీ కెప్టెన్సీ పై గంభీర్ విమర్శలు
అహ్మదాబాద్: మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ రూపంలో ఇద్దరు అత్యుత్తమ కెప్టెన్లు జట్టులో ఉండటంతో టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ పని సులువవుతున్నదని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరి వల్లే అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ప్రభావవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్నాడని పేర్కొన్నాడు. సమకాలిన క్రికెట్‌లో కోహ్లీ ఎన్నో విజయాలు సాధించాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లోనూ విరాట్ ఆకట్టుకున్నాడు. సుదీర్ఘకాలంగా ధోనీ, రోహిత్ అండదండలు ఉండటంతో విరాట్ విజయవంతమవుతున్నాడు అని గంభీర్ అన్నాడు. అయితే ఓ వైపు కోహ్లీని కీర్తిస్తూనే.. ఫ్రాంచైజీ క్రికెట్‌లో అతడి కెప్టెన్సీపై గౌతీ పెదవి విరిచాడు. అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పుడు ఎవరైనా విజయాలు సాధిస్తారు. కానీ అరకోర వసతుల్లో కూడా గెలుపు బాట పట్టించగలిగేవాడే గొప్ప సారథి అని చురకలంటించాడు. ఫ్రాంచైజీలకు నాయకత్వం వహిస్తున్నప్పుడే ఓ కెప్టెన్ అసలు సత్తా బయటపడుతుంది. ఇతర ఆటగాళ్ల నుంచి పెద్దగా సహకారం లేకున్నా రాణించడం సులువు కాదు. ముంబై ఇండియన్స్‌ను నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్.. చెన్నైకి మూడుసార్లు టైటిల్ అందించిన ధోనీతో పోల్చుకుంటే బెంగళూరు ఏం సాధించిందో అందరికీ తెలిసిందే అని గంభీర్ విమర్శలు గుప్పించాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN