ఆ చర్చ ముగించండి

Nava Telangana

Nava Telangana

Author 2019-10-27 04:23:29

- ధోని రిటైర్మెంట్‌పై రవిశాస్త్రి
ముంబయి : ఎం.ఎస్‌ ధోని వీడ్కోలుపై మాట్లాడుతున్న వారిపై టీమ్‌ ఇండియా చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి విరుచుకుపడ్డాడు. భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన దిగ్గజ క్రికెటర్‌గా ఎం.ఎస్‌ ధోని తను ఎప్పుడు వీడ్కోలు పలకాలనే స్వేచ్ఛ సాధించాడు. ధోని వీడ్కోలుపై నిరంతర చర్చ దిగ్గజ క్రికెటర్‌ను అవమానపరచటమేనని రవిశాస్త్రి అన్నాడు. ' వీడ్కోలు ఎప్పుడు పలకాలనే హక్కును ధోని సంపాదించుకున్నాడు. అతడు కోరుకున్నప్పుడు రిటైర్మెంట్‌ తీసుకోనివ్వండి. వీడ్కోలు చర్చకు ఇకనైనా ముగింపు పలకండి' అని శాస్త్రి అన్నాడు. ' ధోని వీడ్కోలుపై ప్రకటనలు అతడిని అవమానించటమే అవుతుంది. భారత జట్టుకు 15 ఏండ్లు ప్రాతినిథ్యం వహించిన ఆటగాడికి జట్టుకు ఏది మంచిదో తెలియదా? టెస్టుల్లో వికెట్‌ కీపర్‌గా వృద్దిమాన్‌ సాహా బాధ్యతలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడని ఐదు రోజుల ఆటకు వీడ్కోలు పలికినప్పుడు ధోని చెప్పాడు. జట్టు పట్ల ధోని బాధ్యత ఈ మాట చెబుతుంది. ఇప్పుడూ అదే పని చేస్తాడు. రాంచి టెస్టులో అరంగేట్రం చేసిన జార్ఖండ్‌ ఆటగాడు షాబాజ్‌ నదీమ్‌ను కలిసేందుకు డ్రెస్సింగ్‌రూమ్‌కు వచ్చాడు. ఓ అరంగేట్ర ఆటగాడిలో స్ఫూర్తి నింపేందుకు ధోని రావటం, అతడిలో ఎంత స్ఫూర్తి నింపుతుంది. ఇవన్నీ తెలిసిన వ్యక్తికి వీడ్కోలు ఎప్పుడు పలకాలో తెలియదా? అని శాస్త్రి ప్రశ్నించాడు. ధోని వీడ్కోలుపై మాట్లాడే వారిలో సగం మంది తమ షు లేస్‌లు సైతం సరిగా కట్టుకోలేరు. కానీ ధోని వీడ్కోలుపై విమర్శలు చేస్తారు. భారత జట్టుకు అద్భుత విజయాలు అందించిన ఆటగాడిని సాగనంపేందుకు ఎందుకు అంత తొందర? చర్చకు ఇతర అంశాలు లేవని ధోని వీడ్కోలుపై మాట్లాడటం సరికాదు. ఎప్పుడు ఆటకు వీడ్కోలు పలకాలో అతడికి తెలుసు. ధోని కచ్చితంగా వీడ్కోలు తీసుకుంటాడని తెలుసు. ఆ మాట అతడు చెప్పే వరకైనా సహనం వహించండి అని రవిశాస్త్రి అన్నాడు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD