ఆ నిర్ణయం కోహ్లీకే వదిలేస్తున్నా : గంగూలీ

Nava Telangana

Nava Telangana

Author 2019-10-22 15:22:00

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత సారథి కోహ్లీ అందుబాటులో ఉంటాడా లేదా అనేది అతడి ఇష్టమని బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న గంగూలీ పేర్కొన్నాడు. వచ్చేనెలలో సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో భారత్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. కోహ్లీ ఈ టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకుంటాడని వస్తున్న వార్తలపై దాదా స్పందించాడు. అక్టోబర్‌ 24న కోహ్లీతో చర్చిస్తా. బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో టీమ్‌ఇండియా కెప్టెన్‌తో మాట్లాడతా. అతడు భారత జట్టుకు సారథి. బంగ్లా సిరీస్‌ ఆడతాడా లేక విశ్రాంతి తీసుకుంటాడా అనేది అతడి ఇష్టం. టెస్టుల్లో రోహిత్‌ శర్మ అద్భుతంగా రాణించడం ఎంతో ఆనందంగా ఉంది. అతడు టాప్‌ బ్యాట్స్‌మన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడు ఏదైనా సాధించగలడు. ఉమేశ్‌ యాదవ్‌ గొప్పగా బౌలింగ్‌ చేస్తున్నాడు. భారత పిచ్‌లపై అంతగా బౌన్స్‌ను రాబట్టుకోలేం. అయినా ఉమేశ్‌ అద్భుతాలు సృష్టిస్తున్నాడుః అని గంగూలీ తెలిపాడు. అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా బాధ్యతలు చేపట్టనున్నాడన్న సంగతి తెలిసిందే.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD