ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ధోనీనే..!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-10 06:32:24

img

న్యూఢిల్లీ: ధోనీ మళ్లీ జట్టులోకి రావాలని అనుకుంటున్నాడా? లేదా? అనేదానిపైనే అతడి ఎంపిక ఆధారపడి ఉంటుందని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. వరల్డ్‌కప్‌ తర్వాత క్రికెట్‌ నుంచి ధోనీ విరామం తీసుకున్నాడు. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా పర్యటనలకు దూరమయ్యాడు. అయితే, ఎప్పటి నుంచి ఆడాలో నిర్ణయం తీసుకోవాల్సింది ధోనీయేనని శాస్త్రి చెప్పాడు. అతడు తన భవిష్యత్‌ ప్రణాళికలను సెలెక్టర్లతో పంచుకోవాలని సూచించాడు. కీపర్‌ రిషభ్‌ పంత్‌ను పక్కనబెట్టడానికి గల కారణాలను వివరించాడు. ‘వృద్ధిమాన్‌ సాహా గాయపడడంతో అతడి స్థానంలో పంత్‌కు అవకాశం దక్కింది. అత్యుత్తమ కీపర్లలో సాహా ఒకడు. అన్‌ ఈవెన్‌ బౌన్స్‌ అయ్యే పిచ్‌లలో అతడి సేవలు ఎంతో విలువైనవి. పంత్‌ ప్రతిభావంతుడే. తన కీపింగ్‌ను మెరుగుపరచుకోవడానికి సమయం ఉంద’ని శాస్త్రి చెప్పాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD