ఆ ఫొటోలతో సంబంధం లేదు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-16 02:37:25

img

సిడ్నీ, అక్టోబర్ 16: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అభిమానులకు క్షమాపణాలు తెలిపా డు. తనకు తెలియకుండానే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటో లు షేర్ చేయడంపై ఆవేదన వ్యక్తం చే శాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను బ్రిటిష్ టాబ్లాయడ్ ‘ది సన్’ ప్రచురించడం తనకు బాధ కలిగిం చిందని పేర్కొ న్నాడు. దీనిపై వాట్సన్ స్పందిస్తూ ‘నా అకౌంట్ తనకు తెలి యకుండానే ఎవరో హ్యాక్ చేశారు. గత శుక్రవారం ఇదేవిధంగా ట్విటర్ అకౌంట్‌ను కూడా హ్యాక్ చేశారు. ఈ సందర్భంగా మీ అందరితో ఒక విష యం పంచుకోవాలనుకుంటు న్నా. ఈ ఫొటోలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్న ప్రతీ ఒక్కరినీ క్షమా పణ కోరుతున్నా’ అని ట్వీట్ చేశాడు. షేన్ వాట్సన్‌ను ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా అకౌంట్లతో కలిపి దాదాపు 2 మిలియన్ ఫాలోవర్స్ ఉ న్నారు. ఆస్ట్రేలియా తరఫున 59 టెసు టలు, 190 వనే్డలు, 58 టీ20ల్లో ప్రాతి నిధ్యం వహించిన వాట్సన్ ఉత్తమ ఆ ల్‌రౌండర్‌గా ఎదిగాడు. అంతేకాకుం డా ఆసిస్ 2007, 2015లో ప్రపంచ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించా డు. ఇక ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయ ల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రా తినిధ్యం వహించాడు.
*చిత్రం... ఆసిస్ మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD