ఆ విషయం వారినే అడగండి

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-17 02:33:35

img

కోల్‌కతా, అక్టోబర్ 17: త్వరలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పదవి చేపట్టనున్న టీమిండియా మాజీ కెప్టెన్, క్యాబ్ (క్రికెట్ అసోసి యేషన్ ఆఫ్ బెంగాల్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌పై విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధా నం దాటవేశాడు. ఇటీవల బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ వేసిన గంగూలీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఖాయం కావడంతో కోల్‌కతాలో విలేఖఠులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తిగా సమాధానం చెప్పాడు. అయతే భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌పై మాత్రం సమాధానా న్ని తెలివిగా దాటవేశాడు. ఆ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అడగా లని సూచించాడు. అయతే అంతర్జాతీయ మ్యాచ్‌లు, విదేశీ పర్యటనలకు ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నా డు. అంతేకాకుండా మీరు అడిగిన ప్రశ్న కు (్భరత్-పాక్ సిరీస్) నా వద్ద సమా ధానం లేదని స్ప ష్టం చేశాడు. అయతే ఇరు దేశాల మధ్య 2012లో చివరి సారిగా రెండు టీ20 మ్యాచ్‌లు, మూడు వనే్డల మ్యాచ్‌ల్లో తలపడ్డాయ. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్ గం గూలీ ఈ నెల 23న బాధ్యతలు చేపట్టనున్నాడు. 2004 లో గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్తాన్‌లో పర్యటించింది. 1999లో కార్గిల్ యుద్ధం తర్వాత జరిగిన తొలి సిరీస్ అదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్న గంగూలీ భారత్- పాక్ మధ్య క్రికెట్ సిరీస్‌కు ప్రయత్నాలు చేస్తారా అనేదానిపై చర్చ జరగ్గా, ఈ విషయంలో ప్రభుత్వాల అనుమతే ముఖ్యమని దాదా స్పష్టం చేశాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN