ఇంగ్లండ్‌ ఆఖరి పంచ్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-09-16 04:56:58

img

  • 135 పరుగులతో ఆస్ట్రేలియాపై గెలుపు
  • 2-2తో యాషెస్‌ సిరీస్‌ సమం

లండన్‌: ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీ్‌సను ఇంగ్లండ్‌ సమం చేసింది. ట్రోఫీని కోల్పోయినా.. ఆతిథ్య జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఆఖరి, ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ 135 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. మరో రోజు మిగిలుండగానే మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ 2-2తో సమం కాగా.. రెండో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. 399 పరుగుల భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 263 పరుగులకే కుప్పకూలింది. మాథ్యూ వేడ్‌ (117) శతకం వృథా అయింది. స్టువర్ట్‌ బ్రాడ్‌ (4/62), లీచ్‌ (4/49) చెరో నాలుగు వికెట్లతో ఆసీస్‌ పతనాన్ని శాసించారు. పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌కు మ్యాచ్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. కాగా 1972 తర్వాత తొలిసారి యాషెస్‌ సిరీస్‌ డ్రాగా ముగిసింది.

వేటాడిన బ్రాడ్‌..: భారీ లక్ష్య ఛేదనలో ఆసీ్‌సను బ్రాడ్‌ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్‌ మార్కస్‌ హ్యారిస్‌ (9)ను బౌల్డ్‌ చేసిన బ్రాడ్‌ ఝలక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (11)ను క్యాచ్‌ అవుట్‌ చేసిన బ్రాడ్‌.. ఒక సిరీ్‌సలో 7 సార్లు ఒకే బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌ చేర్చిన అరుదైన రికార్డును సమం చేశాడు. లబుషేన్‌ (14) కూడా స్వల్ప స్కోరుకే అవుట్‌ కావడంతో ఆసీస్‌ 56/3తో కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న స్మిత్‌ (23)ను బ్రాడ్‌ పెవిలియన్‌ చేర్చడంతో ఇంగ్లండ్‌ విజయం సులువని భావించారు. కానీ, మాథ్యూ వేడ్‌ ఒంటరి పోరాటంతో ఆతిథ్య జట్టును అసహనానికి గురి చేశాడు. మిచెల్‌ మార్ష్‌ (24)తో కలసి ఐదో వికెట్‌కు 63 పరుగులు జత చేసిన వేడ్‌.. పెయిన్‌ (21)తో 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ అవుటైనా కమిన్స్‌ (9)తో జత కలసిన వేడ్‌ ఏడో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. రూట్‌ బౌలింగ్‌లో వేడ్‌ స్టంపౌట్‌ కావడంతో ఆసీస్‌ పోరాటం ముగిసింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 313/8తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులు చేశాయి. ఈ సిరీ్‌సతో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా చెరో 56 పాయింట్లు సాధించాయి.

ఆసీస్‌ కెప్టెన్‌ డీఆర్‌ఎస్‌ వైఫల్యాలు

డీఆర్‌ఎస్‌ విషయంలో కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌ తప్పిదాలు ఆస్ట్రేలి యాకు భారంగా మారాయి. ఇంగ్లండ్‌లో జరుగు తున్న ఆఖరి, ఐదో టెస్ట్‌లో డీఆర్‌ఎస్‌ తీసుకొని ఉండుంటే ఆసీస్‌కు రెండు వికెట్లు దక్కేవి..! కానీ, పెయిన్‌ మిస్‌ జడ్జ్‌ మెంట్‌ కారణంగా.. కంగారూలు భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన పరిస్థితి. ఇంగ్లిష్‌ ఓపెనర్‌ డెన్లీ 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్ష్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ, పెయిన్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లకుండా పొరబాటు చేశాడు. అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న డెన్లీ 94 పరుగులు చేశాడు. అలాగే బట్లర్‌ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లియాన్‌ బౌలింగ్‌లో ఎల్బీ అప్పీలుపైనా డీఆర్‌ఎస్‌కు వెళ్లలేదు. పెయిన్‌ వెంటనే అప్పీలు చేసుంటే బట్లర్‌ క్రీజులో నిలబడేవాడు కాదు. దీంతో బట్లర్‌ 47 పరుగులు స్కోరు చేశాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN