ఇంగ్లండ్‌ క్రికెట్‌ కోచ్‌గా సిల్వర్‌వుడ్‌

Prajasakti

Prajasakti

Author 2019-10-08 03:39:41

img

లండన్‌: ఇంగ్లండ్‌ జట్టు నూతన కోచ్‌గా క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ ఎంపికయ్యారు. ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ అందించిన మాజీ కోచ్‌ ట్రేవర్‌ బేలిస్‌ ఒప్పందం గత నెలతో ముగియడంతో కోచ్‌ పదవికి దరఖాస్తులను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే ఆహ్వానించింది. ఇంగ్లండ్‌ టెస్ట్‌ కెప్టెన్‌ రూట్‌, వన్డే కెప్టెన్‌ మోర్గాన్‌లతో సత్సంబంధాలున్న సిల్వర్‌వుడ్‌ ప్రస్తుతం బౌలింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. సిల్వర్‌వుడ్‌ ఇంగ్లండ్‌ తరఫున ఆరు టెస్టులు, ఏడు వన్డేలు ఆడాడు. సిల్వర్‌వుడ్‌ ఎంపికతో కోచ్‌ రేసులో ఉన్న దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టన్‌, అలెక్‌ స్టివార్ట్‌లకు మొండిచెయ్యి లభించినట్లైంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD