ఇంగ్లండ్ (సి) గ్రాండ్‌హోమ్

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-11-04 06:11:00

img

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (28; 1 ఫోర్, 3 సిక్సర్లు) బ్యాటింగ్‌లో మెరువడంతో పాటు మైదానంలో పాదరసంలా కదులుతూ నాలుగు క్యాచ్‌లు అం దుకోవడంతో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో కివీస్ విజ యం సాధించింది.టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. నీషమ్ (42; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) గప్టిల్ (41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. మలన్ (39), జోర్డన్ (36), మోర్గన్ (32) ఫర్వాలేదనిపించినా.. గ్రాం డ్‌హోమ్ నాలుగు సూపర్ క్యాచ్‌లతో పాటు శాంట్నర్ (3/25) వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో కివీస్ విజయం సాధించింది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD