ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్.. మరో సూపర్ ఓవర్

Andhrajyothy

Andhrajyothy

Author 2019-11-10 13:34:27

img

ఆక్లాండ్: 2019 ప్రపంచకప్ ఫైనల్.. లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌. ఆడుతున్న రెండు జట్లు ప్రపంచకప్ ఫైనల్‌ను ఒక్కసారి కూడా ముద్దాడలేదు. దీంతో తమ అభిమాన జట్టు ప్రపంచకప్‌ను అందుకోవాలని ఇరు దేశాల అభిమానులతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూశారు. కానీ ఆ మ్యాచ్ కాస్త టైగా ముగిసింది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌ నిర్వహిస్తే.. అదీ టై అయింది. దీంతో బౌండరీల లెక్క ప్రకారం.. టోర్నమెంట్ విజేతగా ఇంగ్లండ్‌ను ప్రకటించారు.

అయితే ఈ టోర్నమెంట్ తర్వాత న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌తో మరో సిరీస్ ఆడుతోంది. ఈసారి మ్యాచ్‌లు న్యూజిలాండ్‌లోనే జరుగుతున్నాయి. ఐదు టీ-20ల సిరీస్‌లో ఇరు జట్లు చెరి రెండు మ్యాచుల్లో విజయం సాధించాయి. ఆదివారం ఆక్లాండ్ వేదికగా చివరి టీ-20 జరుగుతోంది. వర్షం కురిసి.. ఆడిపోవడంతో.. మ్యాచ్‌ని 11 ఓవర్లకు కుదించారు. ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. 146 పరుగులు చేశారు. ఈ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడ్డా.. ఆ తర్వాత పుంజుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లు, కివీస్ బౌలర్ల మధ్య జరిగిన హోరాహోరి పోరులో ఈ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది.

దీంతో అంపైర్లు మరోసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 17 పరుగులు చేసింది. ఆ తర్వాత ఈ లక్ష్యాన్ని కివీస్ బ్యాట్స్‌మెన్ చేధించలేకపోయారు. ఆరు బంతుల్లో కివీస్ బ్యాట్స్‌మెన్లు 8 పరుగులు మాత్రమే చేయడంతో ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN