ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్‌ గెలుపు

Nava Telangana

Nava Telangana

Author 2019-11-03 17:20:00

వెల్లింగ్టన్‌: ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లీష్‌ ఆటగాడు క్రిస్‌ జోర్డాన్‌(3 వికెట్లు, 36 పరుగులు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసినా ఆ జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. వెల్లింగ్టన్‌ వేదికగా వెస్ట్‌పాక్‌ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్తిల్‌(41), జేమ్స్‌ నీషమ్‌(42) ధాటిగా ఆడడంతో ఆ జట్టు భారీ స్కోర్‌ సాధించింది. లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్‌ మాలన్‌(39), మోర్గాన్‌(32), జోర్డాన్‌ రాణించినా ఇంగ్లాండ్‌ ఓటమిపాలైంది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ 1-1తో సమానమైంది.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN