ఇండియానా పేసర్స్‌ అదుర్స్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-05 05:48:15

img

ముంబై: భారత్‌లో తొలిసారిగా నిర్వహించిన నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) మ్యాచ్‌ అభిమానులను ఊపేసింది. ఆరంభం నుంచే అత్యంత ఉత్కంఠగా సాగుతూ ఆద్యంతం అలరించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన హోరాహోరీ పోరులో ఇండియానా పేసర్స్‌ జట్టు పాయింట్‌ తేడాతో గెలిచింది. ఇరుజట్ల ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్టు పోరాడడంతో ఇండియానా పేసర్స్‌ 132-131తో శాక్రమెంటో కింగ్స్‌ను ఓడించింది. రెగ్యులర్‌ టైమ్‌ ముగిసేసరికి ఇరుజట్లు 118-118తో సమంగా నిలిచాయి. దీంతో అదనపు ఐదు నిమిషాల సమయంలో పేసర్స్‌ పైచేయి సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD