ఇండియా రికార్డు..ప్రపంచంలో అతిపెద్దది మనదే..?

Dharuvu

Dharuvu

Author 2019-10-30 17:29:43

img

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏది అనే విషయానికి వస్తే అది మెల్బోర్న్ అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచంలోనే లక్ష మంది కూర్చునే సామర్థ్యం కలిగిన అతిపెద్ద క్రికెట్ మైదానం ఇది. అయితే ఇప్పుడు బీసీసీఐ, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కలిపి 1.1 లక్షలకు పైగా కూర్చునే సామర్థ్యంతో గుజరాత్‌లో కొత్త స్టేడియంను సిద్ధం చేస్తున్నాయి. ఈ స్టేడియం పేరు సర్దార్ పటేల్ స్టేడియం, ఇది అహ్మదాబాద్‌లో ఉంది. ఈ స్టేడియం యొక్క 90 శాతం పనులు పూర్తికాగా మిగిలిన పనులు 2020 లో పూర్తవుతాయి. పనులు పూర్తయిన తర్వాత సర్దార్ పటేల్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మారుతుంది. సుమారరు 700కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో స్టేడియం నిర్మిస్తున్నారు. అయితే ఈ కొత్త స్టేడియం లో మొదటి మ్యాచ్ వరల్డ్ ఎలెవన్ వర్సెస్ ఇండియా మధ్య వచ్చే ఏడాది జరగనుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN