ఇండియా విజయదుంధుబి..దక్షిణాఫ్రికా చిత్తు చిత్తు

Teluguin

Teluguin

Author 2019-10-06 11:10:06

img

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇండియాలో జరుగుతున్న ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో విశాఖపట్నంలో జరుగుతున్నా మొదటి టెస్ట్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఐదు రోజుల ఆటలో వరుణుడు అడ్డం పడిన కానీ టీం ఇండియా అద్భుతమైన విజయం సాధించటం సాధారణమైన విషయం కాదు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో 203 పరుగులతో విజయం సాధించి సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసింది.

395 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఒక దశలో 70 పరుగులకే 8 వికెట్స్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 100 పరుగున్ చేస్తుందా అనే అనుమానం వచ్చింది. అయితే చివరిలో డేన్ పైడిత్, సేనురాన్ ముత్తుసామి కలిసి తొమ్మిదో వికెట్ కి 91 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న షమీ డేన్ పైడిత్ ని బౌల్డ్ చేసి ఆ జోడీని విడదీశాడు. ఆ తర్వాత రబడాని కూడా అవుట్ తీసి టీం ఇండియాకి మంచి విజయాన్ని కట్టబెట్టాడు.

మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతమైన సెంచరీ చేసిన రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించటంతో 323 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఆ లక్ష్యాన్ని చూసి ముందుగానే బలహీనపడిన సౌత్ ఆఫ్రికాని మన బౌలర్లు బెంబేలెత్తించారు. ముందుగా షమీ అద్భుతమైన పేస్ తో టాప్ ఆర్డర్ ని కకావిలకం చేశాడు. ఆ తర్వాత జడేజా మిడిలార్డర్ పని పట్టాడు. ఒకే ఓవర్ లో పరుగులేమి ఇవ్వకుండా మూడు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా నడ్డి విరిచాడు. ఆ తర్వాత పని షమీ పూర్తిచేశాడు. రెండో ఇన్నింగ్స్ లో షమీ ఐదు వికెట్లు, జడేజా నాలుగు, అశ్విన్ ఒక్క వికెట్ తీసుకున్నాడు. మూడు టెస్ట్ ల సిరీస్ లో టీం ఇండియా 1-0 తో ముందంజలో ఉంది. ఇరు జట్లు మధ్య రెండో టెస్ట్ ఈ నెల 10న పూణే వేదికగా జరగబోతుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN