ఇంతకు మించిన ఆనందం ఉందా!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-18 06:08:44

న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన చమత్కార, వ్యంగ్యపూరిత కామెంట్స్‌తో ట్విటర్‌లో చురుగ్గా కనిపిస్తుంటాడు. అయితే తాజాగా వీరూ చేసిన ట్వీట్‌కు మాత్రం నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ ఏడాది ఆరంభంలో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. వారిలో కొందరి పిల్లలను సెహ్వాగ్‌ తన అంతర్జాతీయ స్కూల్లోనే చదివిస్తున్నాడు. ఈ సందర్భంగా వారు క్రికెట్‌లో శిక్షణ పొందుతున్న ఫొటోలను ట్వీట్‌ చేశాడు. ‘వారంతా సైనిక హీరోల కుమారులు. ముఖ్యంగా ఆ ఇద్దరు ఇక్కడ ఉండడం గౌరవంగా భావిస్తున్నాను. బ్యాటింగ్‌ చేస్తున్న కుర్రాడు అమర జవాన్‌ రామ్‌ వకీల్‌ కుమారుడు.. బౌలింగ్‌ చేస్తున్న కుర్రాడు అమర జవాన్‌ విజయ్‌ సోరెంగ్‌ కుమారుడు. వీరికి సేవ చేయడం కన్నా మించిన ఆనందం ఉంటుందా’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల పిల్లలకు విద్యా దానం చేస్తున్న మీరు చాలా గొప్పవారంటూ అభిమానులు వీరూను కొనియాడుతున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN