ఇక మహిళల పోరు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-09-24 03:36:00

img

-నేడు దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టీ20
సూరత్ : దక్షిణాఫ్రికాతో టీ20 ఫార్మాట్‌లో తలపడేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మంగళవారం ఇక్కడ ప్రారంభం కానుంది. ఆ జట్టుతో గత ఐదు మ్యాచ్ (ఒకటి ఫలితం తేలలేదు)ల్లో మూడు గెలిచి, ఒకటి మాత్రమే ఓడిన టీమ్‌ఇండియా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. అందునా స్వదేశం కావడం మరింత అనుకూలాంశం. అయితే ఆదివారం జరిగిన రెండో వామప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు చేతిలో బోర్డు ప్రెసిడెంట్ ఎలెవెన్ టీమ్ 83 పరుగుల తేడాతో భారీ పరాజయం చవిచూసింది. భారత మహిళల జట్టు ప్రధానంగా స్మృతి మందన, వేదా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, రోడ్రిగ్స్‌పైనే ఆధారపడి ఉంది. మిథాలీరాజ్ టీ20ల నుంచి రిటైరవడంతో జట్టు ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు శిఖా పాండే, పూజతో పాటు స్పిన్నర్లు పూనమ్, అనూజ సఫారీలను కట్టడి చేసేందుకు సిద్ధమయ్యారు.
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN