ఇసుక కొరత నివారించండి

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-11-04 07:07:32

విజయవాడ, నవంబర్ 3: రాష్ట్రంలో ఇసుక కొరత నివారించి ఉచితంగా సరఫరా చేయాలని, ఐదు నెలలకు పైగా ఇసుక లేక అల్లాడుతున్న భవన నిర్మాణ రంగ కార్మికుల కుటుంబాలకు రూ. 20వేల చొప్పున భృతిగా ఇచ్చి ఆదుకోవాలని, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆదివారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.
సీఎం తక్షణం స్పందించని పక్షంలో తాము రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజాసంఘాలను సమైక్యపరచి ప్రభుత్వంపై ఇసుక సత్యాగ్రహం ప్రకటించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక సమస్య తీవ్రంగా ఉందని, ఐదు నెలలుగా భవన నిర్మాణాలు నిలిచిపోయాయని, ఇళ్ల నిర్మాణం చేపట్టినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. కాంట్రాక్టర్లు, స్టీల్, సిమెంట్, ఇటుక, ఎలక్ట్రికల్ వంటి పలు విభాగాల వ్యాపారులు దెబ్బతిన్నారని, ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్ల వంటి వాహనాల నెలవారీ రుణ వాయిదాలు కూడా కట్టే పరిస్థితి లేకపోయిందన్నారు. ఇంత తీవ్రంగా ఉన్న ఇసుక సమస్య దానంతట అదే పరిష్కారం అవుతుందని సీఎం, మంత్రులు చెప్పడం ఏమాత్రం సరికాదని రామకృష్ణ లేఖలో నిరసించారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD