ఉగ్రవాద సంస్థ హిట్‌లిస్టులో విరాట్ కోహ్లీ
హైదరాబాద్ : ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసింది. క్రికెటర్ కోహ్లీతో పాటు లష్కరే హిట్‌లిస్టులో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోఢీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్‌లతో పాటు తదితరులు ఉన్నారు. ఆల్ ఇండియా లష్కరే తోయిబా పేరున్న ఉగ్రవాద సంస్థ ఈ హిట్లిస్టును రిలీజ్ చేసింది. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. ఈ కొత్త సంస్థను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం రాజకీయవేత్తలను టార్గెట్ చేసే హిట్‌లిస్టులో క్రికెటర్ కోహ్లీ పేరు ఉండడం ఇదే మొదటిసారి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అందిన లేఖలో ఆ పేర్లు ఉన్నాయి. కోజికోడ్ నుంచి ఆ లేఖ రిలీజైంది.