ఉత్కంఠపోరులో అమ్మాయిలు ఓటమి

Prajasakti

Prajasakti

Author 2019-11-03 06:15:40

img

- హర్మన్‌ప్రీత్‌ అద్భుత క్యాచ్‌
- వెస్టిండీస్‌తో తొలి వన్డే

ఆంటిగ్వా : భారత మహిళల జట్టు వెస్టిండీస్‌ పర్యటనలో తొలి వన్డేలోనే పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ బ్యాట్స్‌వుమన్‌ స్టఫానీ టైలర్‌ కొట్టిన ఇన్నింగ్స్‌ చివరి బంతిని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బౌండరీ లైన్‌వద్ద అందుకున్న తీరు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఓట మిపాలైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. విండీస్‌ బ్యాట్స్‌వుమెన్‌ స్టఫానీ టైలర్‌(94) చివరి బంతికి సిక్స్‌కొట్టి సెంచరీ పూర్తి చేసుకోవాలని చూసినా... హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ అద్భుత క్యాచ్‌ అందుకోవడంతో స్టఫానీ సెంచరీ పూర్తి కాకుండానే నిరాశగా వెనుదిరిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు ఓ దశలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించారు. ఆ తర్వాత 55 పరుగులకే 8 వికెట్లు చేజార్చుకొని 224 పరుగుల వద్ద టీమిండియా కుప్పకూలింది. రెండో వన్డే ఆదివారం, మూడో వన్డే బుధవారం జరగనుంది. వన్డే సిరీస్‌ అనంతరం ఇరుజట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD