ఉత్కంఠ పోరులో భారత్ విజయం

Mana Telangana

Mana Telangana

Author 2019-10-14 15:35:33

img

వడోదర: దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 45.5 ఓవర్లలో కేవలం 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్‌విమెన్ లో హర్మన్‌ప్రీత్ కౌర్(38), శిఖా పాండే(35) రాణించగా..మిగతా వారు విఫలమవడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం 147 పరుగుల స్పల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు, భారత బౌలర్లు చెలరేగడంతో 48 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో ఏక్తా బిష్త్ మూడు వికెట్లతో రాణించింది. దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా… మన్షి జోషి, హర్మన్‌ప్రీత్, రోడ్రిగ్స్ చెరో వికెట్ తీశారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఏక్తా బిష్త్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా… ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును దక్షిణాఫ్రికా బ్యాట్స్‌విమెన్ మరిజానే కాప్‌ అందుకుంది.

India Women Team win ODI Series Against South Africa

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD