ఎంపికలో నేను కలుగజేసుకోను

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-19 05:05:00

-నిఖత్ లేఖకు కేంద్ర క్రీడామంత్రి ప్రతిస్పందన
img
న్యూఢిల్లీ: ట్రయల్స్ విషయంలో బాక్సర్లు నిఖత్ జరీన్, మేరీకోమ్ మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది చైనాలో జరిగే టోక్యో(2020) ఒలింపిక్స్ అర్హత టోర్నీ కోసం ఎలాంటి ట్రయల్స్ లేకుండానే మేరీని ఎంపిక చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ యువ బాక్సర్ నిఖత్..కేంద్ర క్రీడాశాఖ కిరణ్ రిజిజుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి ట్విట్టర్ వేదికగా శుక్రవారం ప్రతిస్పందించారు. ఎంపికపై తాను కలుగజేసుకోనంటూనే అత్యుత్తమ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలంటూ భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్‌ఐ)ను మంత్రి కోరారు. దేశం, క్రీడలు, అథ్లెట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని బీఎఫ్‌ఐని కోరుతాను. అంతేగానీ క్రీడా సమాఖ్యలు ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలో మంత్రిగా నేను కలుగజేసుకోను. ఒలింపిక్ చాప్టర్ ప్రకారం స్వయం ప్రతిపత్తి కల్గిన దేశంలోని ప్రతి క్రీడా సమాఖ్య ప్లేయర్లను సెలెక్ట్ చేసే హక్కు ఉంది అని రిజిజు ట్వీట్ చేశారు.

మరోవైపు మంత్రి స్పందనపై నిఖత్ రీట్వీట్ చేసింది. ట్రయల్స్‌పై ఇంత త్వరగా స్పందించినందుకు కృతజ్ఞతలు సర్. దేశానికి పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చేందుకు కష్టపడే అథ్లెట్ల ఎంపికలో ఫేవరేటిజం, నేపోటిజమ్‌కు స్థానం ఉండవద్దు అని ట్వీట్ చేసింది. ఆయా టోర్నీల్లో ప్రదర్శన ఆధారంగా మేజర్ చాంపియన్‌షిప్‌లకు ఎంపిక చేసేందుకు బీఎఫ్‌ఐ గతేడాది నుంచి పాయింట్ల పద్ధతిని తీసుకొచ్చింది. అయితే కొన్ని విభాగాల్లో ఉన్న పోటీ దృష్ట్యా గతంలో ట్రయల్స్ నిర్వహించి అందులో నుంచి టోర్నీలకు పంపించేవారు.
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN